మంగళవారం 02 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 00:34:35

ఆహారం అందించండిలా..

ఆహారం అందించండిలా..

-అన్నార్తులు, అన్నదాతల అనుసంధానం 

-పోలీసుల కొత్త వాట్సాప్‌ గ్రూప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలు, వలసకూలీలు, యాచకులకు ఆహా రం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. కానీ, వారికి ఆహారాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి.. అన్నార్తులు ఎక్కడ ఉంటారు? అనే సమాచారం తెలుసుకోవడం కష్టమవు తున్నది. అలాంటివారిని కలిపేందుకు పోలీసులు వారధిగా మారారు. ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని అత్యవసర, నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇతరాల రవాణాలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు డీజీపీ కార్యాలయంలో ఇప్పటికే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఈ సెంటర్‌ ద్వారా 9490617523 నంబర్‌తో పోలీసులు వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. ఇందులో అన్నార్తుల కోసం ఆహారపదార్థాలు, భోజనం సమకూరుస్తున్న ఎన్జీవోలు, వలంటీర్లతోపాటు, ఆహారం అవసరమైనవారి వివరాలు తెలియజేసే సంస్థలు, వలస కార్మికుల సమాచారం ఇచ్చేవారిని జతచేస్తున్నారు. ఎవరికైనా ఎక్కడైనా ఆహా రం అవసరం ఉంటే ఆ వివరాలను పైన తెలిపిన వాట్సాప్‌ నంబర్‌కు పంపవచ్చు. ఆ ప్రాంతంలోని దాతలెవరైనా స్పందించి వారికి ఆహారం పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం పోలీసులు మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు, పలు ఎన్జీవోలతో కోఆర్డినేట్‌ చేస్తున్నారు. ఆకలికోసం అలమటించేవారికి సకాలంలో భోజనం అందించేందుకు వీలు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. 


logo