మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 13:01:59

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో వాహ‌న పూజ‌లు ప్రారంభం

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో వాహ‌న పూజ‌లు ప్రారంభం

జ‌గిత్యాల : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో గురువారం నుంచి నూతన వాహన పూజలు చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో దాదాపు 193 రోజుల తరవాత భక్తులకు నూతన వాహన పూజ కార్యక్రమం సేవలు అందుబాటులోకి వచ్చాయి.

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆలయంలో భక్తులకు ప్రవేశం, వివిధ ఆర్జిత సేవలు రద్దు చేసిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ స‌డ‌లింపులో భాగంగా జూన్ 8 నుంచి భ‌క్తుల‌కు స్వామి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. వాహ‌నాల పూజ‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. మొత్తానికి తదుపరి సడలింపులో భాగంగా అక్టోబరు 1వ తేదీ నుంచి నూతన వాహన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.logo