గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 16:14:17

రవాణా శాఖలో నూతన ఒరవడి : మంత్రి పువ్వాడ

రవాణా శాఖలో నూతన ఒరవడి : మంత్రి పువ్వాడ

వికారాబాద్ : రవాణా శాఖలో నూతన ఒరవడిని సృష్టించామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని తాండూరు ఆర్టీసీ బస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తాండూరు డిపో ఆధునీకరణకు రెండు కోట్ల రూపాయాల నిధులు అందించినట్లు తెలిపారు.

 రవాణా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్గో సేవలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ  మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.