శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 10:34:27

ప్రకృతి వనాలతో పల్లెలకు కొత్తందాలు : మంత్రి ఎర్రబెల్లి

ప్రకృతి వనాలతో పల్లెలకు కొత్తందాలు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పంచాయతీ రాజ్ చట్టం తెచ్చిన మార్పులతో ఆకు పచ్చ తెలంగాణ ఆవిష్కృతం అవుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ పల్లెల ప్రకృతి వనాలపై తన ట్విట్టర్ లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త అందాలను అద్దుతున్నాయని ట్వీట్ చేశారు. ఈ సందర్భందగా కేటీఆర్ కు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు  రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతి వనాలతో పల్లెల్లో ఆహ్లాద వాతావరణం ఏర్పడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.


logo