సోమవారం 25 మే 2020
Telangana - Mar 31, 2020 , 20:31:51

కామారెడ్డి జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

కామారెడ్డి జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

కామారెడ్డి జిల్లాలో కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి  చంద్రశేఖర్ తెలిపారు దేవుని పల్లి కి చెందిన ఒకిరికి, బాన్సువాడ చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. బాన్సువాడ లో ఇంటింట సర్వే వైద్య సిబ్బందితో నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.  రెండు పట్టణాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా  కొనసాగిస్తామని పేర్కొన్నారు.  ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. బాన్సువాడ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రార్థనలకు వెళ్లి రావడం వల్ల కరోనా పాజిటివ్ అయినట్టు గుర్తించామని పేర్కొన్నారు. 104 బృందాలు కామారెడ్డి పట్టణంలో ఇంటింటికి సర్వే నిర్వహిస్తారని సూచించారు బాన్సువాడ లో 50 బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని పేర్కొన్నారు. 


logo