మంగళవారం 09 మార్చి 2021
Telangana - Jan 18, 2021 , 17:58:45

నూతన సాంకేతికత తప్పనిసరి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

నూతన సాంకేతికత తప్పనిసరి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ : వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ రైతులకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ మండలం కోటకదిర గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వరి నాటు యంత్రం ద్వారా స్వయంగా నారు మడి లోకి దిగి నారు వేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఇది సాధ్యమైందన్నారు.

24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణ పెరిగిందని తెలిపారు. వీటితోపాటు క్రమంతప్పకుండా రైతులకు రైతుబంధు పెట్టుబడి, ఎరువులు, విత్తనాల సరఫరా వంటివి చేయడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగు చేసుకుంటున్నారని, రైతు బంధు  నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. కూలీల కొరత కారణంగా వరి నారు ఇబ్బందిగా ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక యంత్రాలను ఉపయోగించినట్లయితే తక్కువ సమయంలోనే ఎక్కువ ఎకరాల్లో  నాటు కోవచ్చని అన్నారు.

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఆధునిక వారి నాటు యంత్రాలను అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తామని, సబ్సిడీపై  ఈ యంత్రాల సరఫరాకు అవకాశాలను పరిశీలించాలని అదనపు కలెక్టర్ ను, జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ముందుగా  గ్రామంలోని పెద్ద రైతులు ఈ ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. రైతుబంధు ద్వారా కూడా వరి నాటు యంత్రం తెప్పించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హుఖ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం

పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్

అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్‌లో చేరికలు

దారుణం.. కొడుక్కు నిప్పంటించిన తండ్రి 

హాజరు విషయంలో ఒత్తిడి ఉండదు: మంత్రి సబిత

VIDEOS

logo