గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 17:41:18

పాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం : మేయర్‌ బొంతు రామ్మోహన్

పాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం : మేయర్‌ బొంతు రామ్మోహన్

హైదరాబాద్‌ : పాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయ నిర్మాణం తలపెట్టినట్లు హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. పాత సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన నేడు మీడియా ద్వారా మాట్లాడారు. గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో కర్ఫ్యూ, అల్లర్లు అనే పదాలు వినిపించ లేదన్నారు. ప్రతిపక్షాలు మాత్రం ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయన్నారు.

హైదరాబాద్‌ నలువైపులా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో ప్రతిపక్షాలు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాల అంశంలో జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్‌ మతపెద్దలతో మాట్లాడారన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలు అద్భుతంగా నిర్మిస్తామని సీఎం చెప్పారు. చిన్న చిన్న అంశాలపై రాజకీయం చేయడం తగదని మేయర్‌ హితవు పలికారు.


logo