గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 12:10:59

పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం: శ్రీనివాస్‌ గౌడ్‌

పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం: శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నాయకులే తెలంగాణపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నదని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని విమర్శించారు. సోనియాగాంధీ అంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులు నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వెనకబాటుకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు సెక్షన్‌-8 అమలు గురించి మాట్లాడటం దారుణమన్నారు.

ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు నిర్మిస్తానంటే బీజేపీ నేతలు ప్రశంసించారు. కానీ కులిపోయే స్థితిలో ఉన్న భవనాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తే మాత్రం తప్పుపడుతున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కొత్త అసెంబ్లీలు నిర్మిస్తే మాత్రం తప్పుకాదా అని ప్రశ్నించారు. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలవి ఢిల్లీ నుంచి లెటర్లు వస్తే పదవులు ఊడిపోతాయని చెప్పారు.


logo