మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:24

సుపరిపాలన కోసమే కొత్త సచివాలయం

సుపరిపాలన కోసమే కొత్త సచివాలయం

  • సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి

తెలుగు యూనివర్సిటీ: సుపరిపాలన అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం తలపెట్టిందని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్‌ ఏ వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు. పాత సచివాలయ సముదాయం కూల్చివేతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన గురువారం ఒక ప్రకటనలో స్పందించారు. ఆరేండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తమ ఉనికి కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం.. దాని సచివాలయం అంతే గొప్పగా ఉండాలనుకోవడం తప్పా? అని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు.


logo