శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 17:32:48

ఎస్సీ, ఎస్టీల‌కు ఇంటింటికి కొత్త ప‌థ‌కం : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

ఎస్సీ, ఎస్టీల‌కు ఇంటింటికి కొత్త ప‌థ‌కం : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ రూరల్ : ఎస్సీ, ఎస్టీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంటింటికి కొత్త ప‌థ‌కాన్ని తీసుకురాబోతున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు తెలిపారు. వ‌రంగల్ రూర‌ల్ జిల్లా న‌ర్సంపేట వ్య‌వ‌సాయ మార్కెట్‌లో మినీ డైరీ పైల‌ట్ ప్రాజెక్టును మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, కొప్పుల ఈశ్వ‌ర్ ఆదివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో వంద మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేశారు. అనంత‌రం మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండొంద‌ల పింఛ‌ను కూడా ఇవ్వ‌ట్లేద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు కేంద్రం అవార్డుల మీద అవార్డులు ఇస్తోంద‌న్నారు. ఎన్నిక‌ల హామీల‌ను తాము దాదాపు పూర్తి చేసిన‌ట్లు చెప్పారు. క‌రోనా వ‌ల్ల ఒక‌టి రెండు హామీలు మాత్ర‌మే మిగిలాయ‌న్నారు. 

భూములు కొందామ‌న్నా గ్రామాల్లో దొరికే ప‌రిస్థితి లేద‌న్నారు. మూడెక‌రాల భూమి ప‌థ‌కంపై మార్చి నెల త‌ర్వాత కొత్త ప్ర‌ణాళిక‌ను సీఎం కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌న్నారు. ఎస్సీ, ఎస్టీల‌కు ఇంటింటికి కొత్త ప‌థ‌కాన్ని తీసుకురాబోతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


VIDEOS

logo