శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:48:56

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాలు

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాలు


ఏ అధికారికైనా విచక్షణాధికారం వినియోగించే అవకాశమిస్తే లంచగొండితనానికి చోటిచ్చినట్టే. అ మ్మిన, కొన్న వ్యక్తులిచ్చిన పత్రాల ఆధారంగా తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయాల్సిన బాధ్యత లేకపోయినా, మ్యుటేషన్‌ చేసి మారిన హక్కు పత్రాలను ఇ వ్వాలనే చట్టం లేకపోయినా అవినీతి విజృంభిస్తున్నది. 

తప్పుల తడకలు తొలగాల్సిందే

పొలం కొనడం మామూలే, ఆ పొలం అక్కడ ఉందో లేదో తెలుసుకోవడం, హద్దులేవో కచ్చితంగా తెలుసుకోవడం, ఆ పొలం నాదే అని చెప్పుకునే ప త్రం సంపాదించడం చాలా కష్టం. సర్కారు రికార్డులు తప్పుల తడకలు. రికార్డు చూపరు.. అడిగినా చెప్పరు. తప్పులు సరిచేసుకోవడం ఎలాగో కూడా చెప్పరు. సర్వే చేయరు. హద్దులు తేలవు. చట్టాలకేం కొరత లేదు. కనీసం 150 భూమి చట్టాలున్నాయి. భూమిశిస్తు (రెవెన్యూ) వసూలు కోసం భూములను రికార్డు చేయడం సర్కారుకు తప్పనిసరి కనుక ఈ శాఖను రెవెన్యూ అన్నారు. భూమి శిస్తు రద్దయినా రెవెన్యూశాఖ కొనసాగింది. ఈ రికార్డులలో ని రెవెన్యూ పరిభాష వారికి మాత్రమే తెలియడంతో వారి ఆధిపత్యానికి తిరుగులేకుండా పోయి ంది. పహాణీ పత్రంలో 33 కాలమ్స్‌ ఎందుకో, అందులో ఏం రాస్తారో తెలియదు. ఎన్ని డాక్టరేట్లున్నా భూమి రికార్డులు మాత్రం అర్థం కాని బ్ర హ్మపదార్థంగా మారింది. ప్రతి కాగితానికీ వారి చుట్టూ తిరగవలసి రావడం, వారు అడిగినంత లంచం ఇవ్వాల్సి రావటం తప్పటంలేదు. డబ్బున్నవారు లంచాలు ఇచ్చి ఖరీదైన వ్యవసాయ భూ ము లు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులుంటారు, అధికారాలుండవు

భూములు కొని రిజిస్టర్‌ చేసిన తర్వాత కూడా తమ పేరు పట్టాదారులుగా (మ్యుటేషన్‌) పత్రాల్లో నమోదు కాకపోవడంతో అవినీతి, వివాదాలు, కోర్టు తగాదాలు, ఘర్షణలు, నేరాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. దీనికి పరిష్కారాలు-1.తప్పుల్లేని పొలం రికార్డుల కోసం  సమగ్ర సర్వే 2.పొలం హక్కుల వివరాలను, క్రయవిక్రయాల మార్పులను, భూములపై ఉన్న బాకీల సంగతులను రికార్డులలో చేర్చడం, వాటిని ఇంటర్నెట్‌ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచడం, 3.అమ్మకం జరిగిన వెంటనే రికార్డులను తదనుగుణంగా మార్చ డం, 4.మ్యుటేషన్‌ హక్కు పత్రాలను వెంటనే రైతులకు ఇవ్వడం జరగాలి. ఇవన్నీ భారీ నిధులతో భారీ ఎత్తున సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత వేగంగా నిర్వహించవలసిన మార్పులు. దానికి పటిష్ఠమైన పునాదులను కల్పించే చట్టాలను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఒక పెద్ద ముందడుగు. ప్రతి గ్రామంలో ఆర్‌వోఆర్‌ (హక్కు పత్రాలు) నవీకరించి సమగ్రంగా ధరణి పేరుతో డిజిటల్‌ రూపంలో ఉంచాలనే బాధ్యతను ప్రభుత్వంపైన సెక్షన్‌-3 ద్వారా నిర్దేశిస్తున్నారు. ఇప్పుడిది ప్రతి ప్రభుత్వం తప్పనిసరిగా చేసి తీరవలసిన బాధ్యత. అమ్మకం, బహుమతి, తనఖా, మార్పిడి ద్వారా ఆస్తి చేతులు మారితే రిజిష్టర్‌ చేయడానికి ఆన్‌లైన్‌ ద్వారా టైం స్లాట్‌లు ఇవ్వడం, ఆ సమయానికి రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయడం తప్పనిసరి అని సెక్షన్‌-5 నిర్దేశిస్తున్నది. అమ్మడానికి వీల్లేని ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములను ఎవరైనా బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే అందుకు అంగీకరించని సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ప్రభుత్వం పని. చట్టం అమలు, టెక్నాలజీ అండతో బదిలీ చేయకూడదని భూముల రిజిస్ట్రేషన్‌ నిరోధించడం అవసర ం. అందుకు ఆస్కారాన్ని ఈ కొత్త చట్టం కల్పిస్తున్నది. ఎవరైనా కొత్తగా భూమి కొంటే వారికి కొత్త పాస్‌బుక్‌తో పాటు టైటిల్‌ డీడ్‌ ఇస్తారు. అమ్మిన వ్యక్తి పాస్‌బుక్‌లోనుంచి భూమిని తొలగిస్తారు. మారిన వివరాలతో హక్కు రికార్డును నవీకరిస్తారు. మ్యుటేషన్‌ను వాయిదా వేసే వీల్లేదు.  భూముల మీద బకాయిలు, తనఖాలు ఉంటే వాటిగురించి కూడా రికార్డుల్లో నమోదు చేసితీరాలి.  

వారసులదే బాధ్యత

వారసత్వంగా వచ్చే మార్పులను కూడా వారసులందరూ వచ్చి అడిగితే ఆ మేరకు రికార్డులను త యారుచేసి ఇచ్చే బాధ్యత కూడా రిజిస్ట్రార్‌దే. (సెక్షన్‌-6) ఇందుకు వారసులంతా తమ భాగస్వామ్య ఒప్పందం స్వయంగా రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. ఇందులో లోపాలుంటే వారే బాధ్యత వహిస్తారు. రిజిస్ట్రార్‌కు బాధ్యత ఉండదు. వివాదాలుంటే రిజిష్టర్‌ చేయబోరు. కోర్టు డిక్రీ ఉంటే ఆ మేరకు మా ర్పులు చేస్తారు. ఇతర వివాదాల్లో డిక్రీ ద్వారా హక్కులు మారితే ఆ ప్రకారం మార్పులు చేయాలని దరఖాస్తు పెట్టుకొని డిక్రీ ప్రతితో ప్రమాణ పత్రం ఇస్తే ఆ విధంగా మార్పులు చేసి తీరాలి (సెక్షన్‌-7) ప్రభుత్వ భూములను మోసపూరితంగా బదిలీ చేస్తూ పాస్‌బుక్‌ జారీచేస్తే అ అధికారులను బర్తరఫ్‌ చేస్తామనే హెచ్చరిక సెక్షన్‌-8 లో ఉంది. ఇదివరకు ఏ పాస్‌బుక్‌ లేనివారికి కొత్తగా ఇవ్వడానికి 10వ సెక్షన్‌ వీలు కల్పిస్తున్నది. ఈ విధంగా జారీచేసిన పాస్‌బుక్‌లకు తనఖా పెట్టుకునే విలువ కూడా ఉంటుందని సెక్షన్‌-11 స్పష్టం చేస్తున్నది. బ్యాంకులు ‘ధరణి’లో, పాస్‌బుక్‌ వివరాల ఆధారంగా అప్పు ఇవ్వవచ్చు. నిరాకరణకు వీల్లేదు. పొల ం రుణం ఇవ్వడానికి పాస్‌బుక్‌ ఇచ్చితీరాలి అనే అధికారం బ్యాంకులకు లేదని సెక్షన్‌-12 సారాంశం. 

తప్పుడు అధికారులకు బర్తరఫ్‌ శిక్ష

ఏ అధికారి ఎక్కడా నిర్ణయాలు తీసుకొవడానికి ఆస్కారం లేదు. ఒక్కసారి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వస్తే జనం మళ్లీ మళ్లీ అక్కడికి రావలసిన అవసరం ఉండదు. రిజిష్టర్‌ చేయబోనని ఆయన నిరాకరించడానికి గానీ వీల్లేదు. ఏ అధికారి గానీ రికార్డులను తారుమారు చేస్తే అతడిని బర్తరఫ్‌ చేయడానికి ఇతర చర్యలు తీసుకొని, క్రిమినల్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ చేయడానికి వీలుంది. దీంతో తెలంగాణ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల చట్టం-1971ని తొలగిస్తారు. అన్ని పత్రాలు, ధరణి, వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ జరిపించి ప్రభుత్వం పత్రం ఇచ్చిన తరువాత మళ్లీ దానిమీద వివాదాలు వింటానని ప్రభుత్వం అనడం అసమంజసం. కనుక తాసిల్దార్‌, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌లకు ఇకపై వివాదాలు విచారించే అధికారాన్ని తొలగించారు. వారివద్ద విచారణలో ఉన్న పాత కేసులను కొత్తగా ఏర్పాటు చేసే తాత్కాలిక ట్రిబ్యునల్స్‌ పూర్తిచేస్తాయి. రెవెన్యూ కోర్టులనేవే ఉండబోవు. (సెక్షన్‌-16) గ్రామ పంచాయతీ, గ్రేటర్‌ హైదరాబాద్‌, మున్సిపాలిటీ చట్టాలను కూడా సవరించి వెంటనే మ్యుటేషన్‌ జరిపి కొత్త కాగితం ఇవ్వాలనే నియమాలతో కొత్త చట్టాలను కూడా ప్రవేశపెట్టారు.

వీఆర్వోలకు ఇకపై రెవెన్యూ విధులుండవు. వారి పై అధికారులకు రెవెన్యూ బాధ్యతలుంటాయి కానీ అధికారాలుండవు. మూడు సమూలమైన మార్పులను ఈ చట్టాలు చేస్తున్నాయి. ఒకటి- ధరణి పోర్ట ల్‌ ద్వారా భూరికార్డులలో పారదర్శకత. రెండు- అధికారుల విచక్షణాధికారం తొలగింపు, మూడు- రెవెన్యూ కోర్టుల రద్దు. ఒక్కొక్క సెక్షన్‌లో, ఒక్కొక్క పదంలో ఏ విధంగా అధికారాలకు ఆస్కారం ఏర్పడుతున్నదో పరిశీలించి, ముఖ్య కార్యదర్శిని, ప్రత్యే క కార్యదర్శిని, సలహాదారులను మాత్రమే కాకుం డా, కిందిస్థాయి అధికారులను, గ్రామ పంచాయతీ కార్యదర్శులను, మున్సిపాలిటీ అధికారులను, చిన్న, పెద్ద అనే స్థాయీబేధం లేకుండా అందరినీ అడిగి, ఫోన్లు చేసి, ఒకరిద్దరు రిటైరైనారని తెలిస్తే వారిని కూడా పిలిపించి సలహాలు తీసుకొని , చాలా పకడ్బందీగా చట్టాలను తయారుచేయడంలో నిశితమైన శ్రద్ధ చూపారు. (ఈ రచయితతో సహా) అనేక మంది అనధికారులను కూడా అడిగారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ ప్రతి సమావేశంలో పాల్గొని చర్చించారు. సమగ్రమైన సర్వే పూర్తిచేసి, పటిష్ఠమైన సమర్థవంతమైన పోర్టల్‌ను రూపొందించగలిగితే చట్టం చెప్పిన మార్పులు విజయవంతమైతే కోర్టు ల్లో ఉన్న 66 శాతం భూ వివాదాలు తగ్గిపోతాయి. ప్రభుత్వానికి ప్రజలకు వేల కోట్ల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. కోర్టుల్లో ఖాళీలు నింపకుండానే కొత్త సంస్కరణలు అవసరం లేకుండానే పనిభారం తగ్గుతుంది.

ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌(వ్యాసకర్త: డీన్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ, కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌)logo