గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 20:06:06

రైతులకు మేలు చేయడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

రైతులకు మేలు చేయడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

సిద్దిపేట : రైతులకు మేలు చేయడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువ‌చ్చిన‌ట్లు రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మంత్రి హ‌రీశ్ రావు గురువారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి తెచ్చిన చట్టానికి రైతులు పాలాభిషేకం చేస్తే రైతుల నడ్డి విరిచే చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నార‌న్నారు. 

కేంద్ర ప్రభుత్వం పంపుసెట్లకాడ అమర్చే మీటర్లు రైతుల పాలిట తూటాలు అవుతాయ‌న్నారు. రూ. 600 కోట్లతో లక్ష కల్లాల నిర్మాణం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపడుతున్న‌ట్లు చెప్పారు. దుబ్బాకలో 548 మంది రైతులకు రైతు భీమా అందించిన‌ట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిలకు రూ.5,555 కోట్ల ఆర్థిక సాయం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఏడాదికి రూ. 11,700 కోట్లు పింఛన్లను ఖర్చు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రూ. 700 కోట్లు మాత్రమేన‌న్నారు. అవినీతి రహితంగా ఆలస్యం లేకుండా సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు.