వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బైరు వెంకట్రామ్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బోధనలో 31 సంవత్సరాల అనుభవం వెంకట్రామ్ రెడ్డి సొంతం. ప్రత్యేకంగా మాలిక్యులర్ స్పెక్ట్రాస్కోపీ అండ్ డీఎఫ్టీ కాంప్యుటేషన్స్ అండ్ మెటిరియల్ సైన్స్‌లో. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 41 పేపర్స్ ప్రచురించారు. ఈయన పర్యవేక్షణలో ముగ్గురు స్కాలర్స్ పీహెచ్డీ పట్టా అందుకున్నారు. బోధనలో విశేష అనుభవం ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ హెడ్‌గా పరిపాలన విభాగంలోనూ మంచి అనుభవం ఉంది. సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్‌కి ఇంచార్జ్ డైరెక్టర్‌గా, ఎగ్జామ్స్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడిషనల్ కంట్రోలర్‌గా, గోదావరి ఖనిలోని యూనివర్సిటీ పీజీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు.