మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 15:40:03

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొత్త సంస్క‌ర‌ణ‌లు!

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొత్త సంస్క‌ర‌ణ‌లు!

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్ర‌మాణాల పెంపుపై ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ప‌లు శాఖ‌ల అధిప‌తులు హాజ‌ర‌య్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్ర‌మాణాల‌ను పెంచేందుకు నూత‌న సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మ‌రింత‌గా పెంచుతామ‌ని స్ప‌ష్టం చేశారు. నూత‌న సంస్క‌ర‌ణ‌లతో రాష్ర్ట ప్ర‌యోజ‌నాల‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయ‌న్నారు. పౌరుల‌కు అన్ని సేవ‌లు ఒకే చోట అందించేందుకు సిటీజన్ స‌ర్వీస్ మేనేజ్‌మెంట్ పోర్ట‌ల్‌కు ప్ర‌తిపాద‌న చేశారు కేటీఆర్.  శాఖ‌ల ప‌రంగా చేప‌ట్టే సంస్క‌ర‌ణ‌ల‌తో ఆయా శాఖ‌ల ప‌నితీరులో సానుకూల మార్పులు చేయాల‌న్నారు. 

త్వ‌ర‌లోనే టీఎస్ బీపాస్ చ‌ట్టం అమ‌లు

టీఎస్ బీపాస్ చ‌ట్టంపై కూడా మంత్రి కేటీఆర్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ బీపాస్ అనేది చారిత్రాత్మ‌క చ‌ట్ట‌మ‌ని పేర్కొన్నారు. చ‌ట్టం అమ‌లులో వివిధ శాఖ‌ల స‌హ‌కారం, స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌న్నారు. టీఎస్ బీపాస్ అనుమ‌తుల‌కు సంబంధించి అవ‌స‌రం ఉన్న ప్ర‌తి శాఖ నుంచి ఒక్కొక్క నోడ‌ల్ అధికారిని ప్ర‌త్యేకంగా నియ‌మించాల‌ని ఆదేశించారు. త్వ‌ర‌లోనే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. logo