మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 25, 2020 , 15:02:31

ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి హరీశ్‌రావు

ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 16వ వార్డులో జరిగిన పట్టణప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, కలెక్టర్‌ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. 6 నెలల్లో సదాశివపేటలో నీటి సమస్యలేకుండా చూస్తామని తెలిపారు. కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందన్నారు. మున్సిపల్‌ చట్టంతో పారద్శకత పెరుగుతుందన్నారు. 75 గజాలలోపు ఇల్లు కట్టాలంటే రూపాయి ఫీజు కడితే చాలన్నారు. అదే 250 గంజాలలోపు ఇల్లు కడితే సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇస్తే చాలన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతి మున్సిపాలిటీకి ఉన్నతాధికారిని నియమించినట్లు తెలిపారు.


logo