మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 01:55:10

‘ధరణి’లో కొత్త ఆప్షన్‌

‘ధరణి’లో కొత్త ఆప్షన్‌

  • పట్టాదార్‌ పాస్‌బుక్‌ నకలు పొందే అవకాశం

హైదరాబాద్‌, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ధరణిలో మరో కొత్త ఆప్షన్‌ వచ్చి చేరింది. పట్టాదార్‌ పాస్‌బుక్‌ (పీపీబీ) నకలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సిటిజన్‌ లాగిన్‌లో ప్రత్యేకంగా ‘క్రియేట్‌ పీపీబీ రిక్వెస్ట్‌' అనే ఆప్షన్‌ను చేర్చారు. ఇందుకోసం పట్టాదార్‌ పాస్‌బుక్‌ నంబర్‌, ఆధార్‌లోని మొదటి నాలుగు నంబర్లు నమోదుచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే.. పట్టాదార్‌ పాస్‌బుక్‌ నకలు యజమాని చిరునామాకు వస్తుందని అధికారులు తెలిపారు.