గురువారం 28 మే 2020
Telangana - May 20, 2020 , 01:06:26

తినేటప్పుడు తెరుచుకునే మాస్కు!

తినేటప్పుడు తెరుచుకునే మాస్కు!

కరోనా కారణంగా తెల్లారింది మొదలు.. రాత్రి నిద్రపోయేంత వరకూ ముఖానికి మాస్కులను ధరించడం తప్పనిసరైంది. మిగతా సమయాల్లో ఎలాగున్నా.. హోటళ్లలో, ఆఫీసుల్లో నీళ్లు తాగేప్పుడు, తినేటప్పుడు మాస్కుల్ని తీయడం, మళ్లీ పెట్టుకోవడం కొంచం కష్టంగా మారింది. దీంతో ఇజ్రాయెల్‌ ఆవిష్కర్తలు దీనికి ఓ చక్కని పరిష్కారాన్ని  కనిపెట్టారు. ఓ వినూత్న మాస్కును ‘అఫప్టిపస్‌ పేటెంట్స్‌ అండ్‌ ఇన్వెన్షన్స్‌' అనే సంస్థ తయారు చేసింది. ఆహారం లేదా పానీయాన్ని చెయ్యి లేదా స్పూన్‌తో నోటి దగ్గరికి తీసుకువచ్చి.. రిమోట్‌ను ఆపరేట్‌ చేస్తే మాస్కు తెరుచుకుంటుందని ఆవిష్కర్తలు తెలిపారు. ఈ మాస్క్‌ ధర 0.85 - 2.85 డాలర్లు  ఉంటుందని చెప్పారు.


logo