గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 18:22:40

ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు

ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు

జగిత్యాల : రాష్ట్రంలో కుల వృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి మండలం అక్కపెల్లి చెరువులో మంత్రి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామగ్రిని సబ్సిడీపై అందజేస్తున్నారని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులుల్లో సొసైటీల్లో ఉన్నమత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. దీంతో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయని పేర్కొన్నారు.


logo