బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 14:29:37

నవ భారత నిర్మాత పీవీ : శాసన మండలి చైర్మన్ గుత్తా

నవ భారత నిర్మాత పీవీ : శాసన మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ : నల్లగొండ కలెక్టరేట్ లో దివంగత  మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ.. దేశంలొ మొట్టమొదటి సారి భూ సంస్కరణ చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత మన తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుదేనని గుర్తు చేశారు. పీవీ బహుభాషా కోవిదుడని, 17 భాషలను అవపోసాన పట్టిన గొప్ప నాయకుడని కొనియాడారు.

కష్టకాలంలో దేశానికి సరైన దిశానిర్దేశం చేసిన వారిలో పీవీని మించిన వారులేరన్నారు. అందుకే తెలంగాణ బిడ్డగా పీవీ చేసిన సేవలను తరవాతి తరాలు గుర్తించేటట్లుగా సంవత్సరం పాటు శత జయంతి వేడుకలు జరపాలని ముఖ్య మంత్రి కెసీఆర్ నిర్ణయించటం చాలా గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లబోతు భాస్కర్ రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్  చైర్మన్ మందడి సైదిరెడ్డి, అధికారులు ఉన్నారు.


logo