శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 19:16:23

మూడు రోజుల్లోనే మూసీకి కొత్త గేట్లు : మంత్రి జగదీష్ రెడ్డి

మూడు రోజుల్లోనే మూసీకి కొత్త గేట్లు : మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : మూడు రోజుల్లోనే మూసీ నదికికి కొత్త గేట్లు అమర్చే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. చుక్క నీటిని వృథాకానివ్వమని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా మూసిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే లీకేజీలతో నీళ్లన్నీ కృష్ణా లో కలిసి వృథాగా పోయాయని తెలిపారు. మూసీ ప్రాజెక్ట్ ను సందర్శించి కొత్త గేట్లు అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.


2014 తరువాత రాష్ట్రంలో టీఆర్ఎస్  అధికారంలోకి వచ్చిన మీదటనే సాగునీటి ప్రాజెక్ట్ లపై దృష్టి సారించిందన్నారు.మూసీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిన మీదట అప్పటి పాలకులు అటు వైపు చూడక పోవడం వల్లనే మొన్నటి వర్షాలకు గేట్లు పక్కకు తొలిగాయని పేర్కొన్నారు. అయినా ఆఘమేఘాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్టాఫ్ లాగ్ గేట్లు అమర్చి నీటి వృథాను అడ్డుకున్నామన్నారు. తాజాగా జరుగుతున్న మరమ్మతులతో మూసీ ఆయకట్టు రైతాంగానికి రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లు అందిస్తామన్నారు.logo