శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 22, 2020 , 02:50:42

కూల్‌డాలీ.. ఔషధాల రవాణా ఈజీ

కూల్‌డాలీ.. ఔషధాల రవాణా ఈజీ

  • జీఎంఆర్‌ ఎయిర్‌ కార్గోలో కొత్త ఏర్పాటు
  • నిర్ణీత ఉష్ణోగ్రతతో సరుకు రవాణా 

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ/శంషాబాద్‌: నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచాల్సిన ఔషధాలు, ఇతర సరుకుల రవాణాకు మల్టీ యూఎల్డీ (యూనిట్‌ లోడ్‌ డివైజ్‌) కూల్‌ డాలీని జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం ఆవిష్కరించింది.  జీఎంఆర్‌ గ్రూపు ‘రిపోజింగ్‌ ద ఫెయిత్‌ ఇన్‌ ఫ్లయింగ్‌' అన్న వెబినార్‌ సిరీస్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘ఎయిర్‌ కార్గో  చేంజింగ్‌ డైమెన్షన్స్‌' అనే మూడో వెబినార్‌లో పౌర విమానయానశాఖ(ఎంఓసీఏ) సీనియర్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ వందనా అగర్వాల్‌(ఐఈఎస్‌) వర్చువల్‌గా ఈ కూల్‌డాలీనీ ఆవిష్కరించారు. ఇది ఒక్క ట్రిప్‌లో 7 టన్నుల కార్గోను హ్యాండిల్‌ చేయగలదు. అత్యంత కఠిన ఉష్ణోగ్రతలను తట్టుకొని, టెంపరేచర్‌ సెన్సిటివ్‌ ఔషధాలు, ఇతర పెరిషబుల్స్‌(చెడిపోయే అవకాశమున్న పదార్థాలు) రవాణాను సులభతరం చేస్తాయి. టెర్మినల్‌ బిల్డింగ్‌ నుంచి విమానంవరకు అత్యంత తక్కువ దూరం ఉన్నా.. వేసవిలో అత్యంత వేడిగా ఉండే రన్‌ వేలు ఔషధాలపై ప్రభావాన్ని చూపుతాయి. కూల్‌ డాలి అన్ని రకాల విమానాలకు ఉపయోగపడతాయి. ఉత్పత్తులను సురక్షితంగా రవాణా చేసేందుకు వీలుగా దీనిలో అంతర్గతంగా పవర్‌ బ్యాకప్‌ కూడా ఏర్పాటుచేశారు. జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌, బ్లూడార్ట్‌ ఏవియేషన్‌ ఎండీ తులసీ మిర్చందానీ, ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) సీఈవో గజ్దార్‌, అజిలిటీ లాజిస్టిక్స్‌ సీసీఈ సతీశ్‌ లక్కరాజులతోపాటు కార్గో రంగానికి చెందిన ప్రముఖులు వెబినార్‌లో పాల్గొన్నారు. 


logo