ముంబై, జూన్ 9:నాన్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ హోమ్..తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించడానికి వీలుపడనున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో తెలంగాణతోపాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఉన్నవారికి లబ్ధిచేకూరనున్నదని ఒక ప్రకటనలలో వెల్లడించింది.