బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 21:26:43

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 47 కరోనా కేసులు

తెలంగాణలో ఈ రోజు  కొత్తగా 47 కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఈ రోజు కొత్తగా 47 నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 పాజిటివ్‌ కేసులు రాగా, రంగారెడ్డి జిల్లాలో ఐదు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు వలస కూలీలుగా గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1414కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 34 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. చికిత్స అనంతరం ఈ రోజు 13 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 952కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 428. 


logo