నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

హైదరాబాద్ : బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గడిచిన రోజుల్లో బ్రిటన్ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి చేరుకోగా.. వారందరికీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కొత్త రకం వైరస్ గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్రం ఏర్పాటుకు రూ.40కోట్ల వ్యయం కానుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీసీఎంబీలో జన్యుపరిశోధనలు సాగుతున్నాయి. గత నెల రోజుల్లో బ్రిటన్ నుంచి తెలంగాణకు సుమారు మూడు వేల మంది వరకు వచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 800 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీకి ముందుగా వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా తేలిన ఇద్దరి నమూనాలను అధికారులు సీసీఎంబీకి పంపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యుల చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 12 ఆస్పత్రులను వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక చేసింది. ఇందులో వారికి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
- నదిలో పడవ మునిగి నలుగురు మృతి
- యూకే వైరస్‌పై సమర్థంగా పని చేస్తున్న కొవాగ్జిన్
- యాపిల్ ఐఫోన్ : భారత్‌లో బంపర్ సేల్స్