హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 733 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 2850 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,636 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 56,487 కరోనా నిర్ధారణ పరీక్షలను అధికారులు నిర్వహించారు.