బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 15:04:03

శివకోటి మందిరంతో బుధవార్‌పేట్‌కు కొత్త శోభ

శివకోటి మందిరంతో బుధవార్‌పేట్‌కు కొత్త శోభ

నిర్మల్‌ : శివకోటి మందిరంతో బుధవార్‌పేట్‌కు కొత్త శోభ వచ్చిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం బుధవార్‌పేట్‌లోని పురాతన ఆలయం శివకోటి ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. వేద పండితులతో కలిసి శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాల్లో ఆధ్యాత్మికత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటదన్నారు.

ఈ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల నిధులు కేటాయించామని, కాంపౌండ్ వాల్ ఆలయ అభివృద్ధి పనులకు మరో రూ.15 లక్షలు నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బంగల్ లెట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రూ.కోటితో త్వరలోనే అభివృద్ధి చేస్తామన్నారు. నిర్మల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. logo