గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 15:52:52

రెవెన్యూ చరిత్రలో నూతన అధ్యాయం: మ‌ంత్రి అల్లోల

రెవెన్యూ చరిత్రలో నూతన అధ్యాయం: మ‌ంత్రి అల్లోల

హైదరాబాద్‌ : ధ‌ర‌ణి పోర్టల్‌ సేవ‌లు అందుబాటులోకి రావ‌డంతో భూ ప‌రిపాల‌న‌లో నూత‌న అధ్యాయ‌ం ప్రారంభ‌మైంద‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర‌ణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు రూపం పోసుకున్న ధరణి పోర్టల్ తో ప్రజల ఆస్తులు కాపాడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి ఓ ప్రకట‌న‌లో పేర్కొన్నారు. ధరణి పోర్టల్ సేవ‌ల‌తో భూ పంచాయతీలే ఉండవని ఆయన అన్నారు. ప్రజలు దళారుల బారిన పడకుండా పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త విధానానికి నాంది పలికిందని తెలిపారు. నూత‌న రెవెన్యూ చ‌ట్టం ద్వారా ప్రజలకు సులభతర సేవలందించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.