మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 12:10:28

చెత్త‌కుప్ప‌లో ప‌సిపాప‌.. ర‌క్షించిన గ్రామ‌స్తులు

చెత్త‌కుప్ప‌లో ప‌సిపాప‌.. ర‌క్షించిన గ్రామ‌స్తులు

ఖమ్మం: ‌జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో ఇంకా క‌ళ్లు తెర‌వ‌ని ప‌సిగుడ్డును గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చెత్త‌కుప్ప‌లో వ‌దిలివెళ్లారు. మండ‌లంలోని రాయగూడెంలోని ముత్యాలమ్మ గుడి స‌మీపంలో ఉన్న‌ చెత్త కుప్పలో  అప్పుడే పుట్టిన పసికందును గ్రామస్తులు గుర్తించారు. ప‌సిపాప కుక్కల బారిన పడకుండా బయటకు తీసుకు వచ్చి గోనే సంచిపై ఉంచి ఒక చోట పెట్టారు. విష‌యం తెలుసుకున్న గ్రామ స‌ర్పంచ్  వైద్య సిబ్బందికి, పోలీసులకు స‌మాచారం అందించారు.  


logo