మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 01, 2020 , 09:16:35

బ్రోకర్లను నమ్మొద్దు...

బ్రోకర్లను నమ్మొద్దు...

హైదరాబాద్:  నగరంలో ఏర్పాటు కానున్న బస్తీదవాఖానలకు సంబంధించి డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులకు సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తికావస్తున్నదని హైదరాబాద్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిశీలన పూర్తయింది. 2న ప్రొవిజినల్‌ వెరిఫికేషన్‌, 7న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తాం.11న సాయంత్రం వైద్యుల ఎంపికకు సంబంధించిన తుది జాబిత జిల్లా వైద్యాధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. 6న స్టాఫ్‌ నర్సులకు సంబంధించి ప్రొవిజినల్‌ వెరిఫికేషన్‌, 18న సాయంత్రం తుదిజాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. బ్రోకర్లు బస్తీ దవాఖానల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు దృష్టికి వచ్చింది. అలాంటి వారిని నమ్మొద్దు. సిబ్బంది నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేవని పేర్రకొన్నారు.  కొత్తగా ఏర్పాటు కానున్న బస్తీ దవాఖానల్లో పనిచేసేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో మొత్తం 152పోస్టులకు 3,970మంది దరఖాస్తు చేసుకున్నారు.  90 బస్తీదవాఖానలకు సంబంధించి 94 వైద్య పోస్టులకు 492 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  58 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు అత్యధికంగా 3,478మంది అభ్యర్థులు అర్జీ చేసుకున్నట్లు వెల్లడించారు. 


logo
>>>>>>