బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 13:19:14

రైతుల మేలు కోసమే నూతన వ్యవసాయ విధానం

రైతుల మేలు కోసమే నూతన వ్యవసాయ విధానం

సంగారెడ్డి : పదవి రావడం గొప్ప కాదు.. పదవి నిర్వహించడం గొప్ప అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి, ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హజరై పఠాన్ చెరు మార్కెట్ యార్డులో నూతన షాపింగ్ క్లాంపెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయ విధానం సీఎం కేసీఆర్ తీసుకొచ్చినట్లు తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు.

 రాష్ట్రం వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు.  హైదరాబాద్ మహా నగర అవసరాలు తీర్చేలా పటాన్ చెరు మార్కెట్ ను అభివృద్ధి చెయ్యాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతామని తెలిపారు. హైదరాబాద్ మహా నగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 


logo