మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 09:21:44

రాష్ట్రంలో కొత్త‌గా 2012 క‌రోనా కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 2012 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కొత్త‌గా 1139 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య‌ 50,814కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 2013 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 70,958 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 19,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బుధ‌వారం ఉద‌యం వ‌రకు కొత్త‌గా 13 మంది బాధితులు మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనాతో 576 మంది మృతిచెందారు.

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 523 కేసులు న‌మోద‌వ‌గా, మేడ్చ‌ల్ జిల్లాలో 198 కేసులు, రంగారెడ్డిలో 188, వ‌రంగ‌ల్‌లో 127, ఖ‌మ్మంలో 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‌లో 83, కామారెడ్డిలో 75, కొత్త‌గూడెం జిల్లాలో 52, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 51, న‌ల్ల‌గొండ‌లో 49, గ‌ద్వాల‌లో 48, భూపాల‌ప‌ల్లిలో 46, పెద్ద‌ప‌ల్లిలో 41, క‌రీంన‌గ‌ర్‌లో 41, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 36, సిద్దిపేట‌లో 28, వ‌రంగ‌ల్ గ్రామీణ‌లో 28, జ‌గిత్యాల‌లో 27, సూర్యాపేట‌లో 27, భువ‌న‌గిరిలో 26, మెద‌ర్‌లో 21, వ‌న‌ప‌ర్తిలో 20, ములుగులో 18, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 19, ఆదిలాబాద్‌లో 15, సిరిసిల్ల‌లో 10, నిర్మ‌ల్‌లో 9, వికారాబాద్‌లో 6, నారాయ‌ణ‌పేట‌లో 4, మంచిర్యాల‌లో ఒక క‌రోనా కేసు న‌మోద‌య్యింది.


logo