శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 09:25:24

తెలంగాణలో కొత్తగా 1983 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1983 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1983 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,02,594కు చేరింది. వైరస్‌ నుంచి తాజాగా 2381 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,74,769 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,644 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 21,784 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వైరస్‌ కారణంగా మరో పది మంది చనిపోగా.. ఇప్పటికీ 1181 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58శాతంగా ఉందని, అలాగే రికవరీ రేటు 86.26 శాతంగా ఉందని తెలిపింది. 24గంటల్లో 50,598 శాంపిల్స్‌ పరీక్షించగా.. మొత్తం 32,92,195 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 292, రంగారెడ్డిలో 187, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 145, ఖమ్మంలో 117, కరీంనగర్‌లో 109, నల్లగొండలో 105, భద్రాద్రి కొత్తగూడెంలో 85 కరోనా కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.