ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 09:43:41

క‌రోనా నుంచి కోలుకున్న 1222 మంది బాధితులు

క‌రోనా నుంచి కోలుకున్న 1222 మంది బాధితులు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో క‌రోనా నుంచి మ‌రో 1222 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్న‌వారి సంఖ్య 2,37,172కు చేరింది. నిన్న కొత్త‌గా మ‌రో 997 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 2,55,663 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 17,094 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 14,466 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. నిన్న రాత్రివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల‌ న‌లుగురు మ‌ర‌ణించారు. దీంతో క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 1,397 మంది బాధితులు మృతిచెందారు. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 169 ఉండ‌గా, మేడ్చ‌ల్ జిల్లాలో 85, రంగారెడ్డిలో 66 చొప్పున రికార్డ‌య్యాయి.