ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 13:09:40

నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి: మండలి చైర్మన్‌ గుత్తా

నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి: మండలి చైర్మన్‌ గుత్తా

నల్లగొండ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం అందరికి స్ఫూర్తినీయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలని కోరారు. అప్పుడే దేశభక్తిని చాటిన వారమవుతామని, దానిని నేటి యువతరానికి అందించాలన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా నల్లగొండలోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేటి యువత స్వశక్తిపై రాణించాలని కోరారు. పాఠశాల స్థాయి నుంచే ఎన్సీసీని అమలుచేసి పిల్లల్లో జాతీయభావం పెంచాలన్నారు. అప్పుడే దేశరక్షణలో పాలుపంచుకోవాలనే భావన కలుగుతుందని చెప్పారు. 

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిత్య సామూహిక జాతీయ గీతాలాపన ఆలోచన అభినందనీయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఉదయం 8:30కి విధిగా జాతీయగీతం ఆలపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ ఏవీ రంగనాథ్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo