బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 08:38:59

వేలానికి నేతాజీ ఫండ్‌ రసీదు..

వేలానికి నేతాజీ ఫండ్‌ రసీదు..

హైదరాబాద్‌‌: కొంతమందికి పాత నాణేలు, వస్తువులు, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమంది తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్‌ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన మాషం దామోదర్‌రావు వద్ద సుమారు 325 రకాల పాత నోట్లు ఉన్నాయి. దీంతోపాటు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా అప్పట్లో బర్మాలో నేతాజీ ఫండ్‌ పేరిట రూ.100 రసీదు పత్రాన్ని, స్టాంప్స్‌, నాణేలను  దామోదర్‌రావు సేకరించాడు. శనివారం సాయంత్రం దాము ఆక్షన్‌.కామ్‌లో నేతాజీ ఇచ్చిన రసీదును అమ్మకానికి పెట్టారు. సుమారు రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఆన్‌లైన్‌లో ఉంచారు. రేపటి వరకు వెబ్‌సైట్లో నచ్చినవారు బిడ్డింగ్‌లో పాల్గొని తమకు తోచిన మొత్తాన్ని కోట్‌ చేసుకునేందుకు వీలు కల్పించారు.  ఇదిలా ఉండగా నేడు ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో పురాతన నోట్లతోపాటు కాయిన్‌లను కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారు చాటింగ్‌ చేయవచ్చని దామోదర్‌రావు పేర్కొన్నారు. 

VIDEOS

logo