శనివారం 06 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:16:05

నెహ్రూ జూపార్క్‌ పసికూనల సందడి

నెహ్రూ జూపార్క్‌ పసికూనల సందడి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్‌ పసికూనల సందడితో కళకళలాడుతున్నది. అత్యంత అరుదైన జాతుల వన్యప్రాణులు ఊపిరిపోసుకోవడంతో కొత్త శోభను సంతరించుకున్నది. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి జూ పార్క్‌ను మూసి ఉంచారు. అప్పటి నుంచి జూలోకి సందర్శకులకు అనుమతినివ్వడం లేదు. ఈ సమయంలో జూలోని జంతువులు హుషారుగా ఎన్‌క్లోజర్‌లలో సంచరిస్తున్నాయి. ఆఫ్రికన్‌ సింహం ఆదిశాన్‌ రెండు కూనలను ప్రసవించగా మరోవైపు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఆశా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. 

గోల్డెన్‌ జాకాల్‌ జాతికి చెందిన నక్క ఆరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆస్ట్రిచ్‌, మకావ్‌ పక్షి జాతికి చెందిన దాదాపు పది పిల్లలు ఊపిరిపోసుకుని హుషారుగా తిరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే రెక్కలు తొడుగుతున్నాయి. కాగా తల్లుల సంరక్షణలో ఉన్న సింహం, పెద్దపులుల పిల్లలను జూ అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. ఇటీవల పుట్టిన పిల్లలన్నీ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు జూ క్యూరేటర్‌ క్షితిజ తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూనలను సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లలోకి వదులుతామన్నారు.


logo