శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 14:03:35

జాతీయ అర్హ‌త ప్ర‌వేశ‌(నీట్‌) ప‌రీక్ష ప్రారంభం

జాతీయ అర్హ‌త ప్ర‌వేశ‌(నీట్‌) ప‌రీక్ష ప్రారంభం

హైద‌రాబాద్ : దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వ‌హించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ జరుగుతుంది.  దేశ‌వ్యాప్తంగా 15.97 లక్షల మంది విద్యార్థులు ప‌రీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 55,800 విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద నిర్వాహ‌కులు కొవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారు. విద్యార్థుల‌కు మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు.  logo