సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:55:05

నీరు పారింది.. ఊరు మారింది

నీరు పారింది.. ఊరు మారింది

నీరు పారింది.. ఊరు మారిందిఊరును నమ్ముకున్నోళ్ల కల నిజమైంది. ఒకప్పుడు ఊర్లో ఉంటే బతుకు లేదని.. ఊరొదిలి హైద్రాబాద్ ముంబయి బాట పట్టిన రైతన్నలుఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన నిండు నీళ్లను చూసి, మళ్లా సొంతూరు బాట పట్టారు. ఉన్న భూమిలో పంట పండించుకుంటూ సొంత ఊళ్లో, సొంతోళ్లతో సంబురంగా ఉంటున్నారు. సూర్యపేట జిల్లా నాగారాం మండలం వర్థమానుకోట కాళేశ్వరం జలాలతో సంబురం చేసుకుంటున్నది.కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల రాకతో కళకళలాడుతున్నది. రెండేండ్ల కిందటి వరకు కేవలం మూడు వేల ఎకరాలు మాత్రమే సాగుచేసుకుంటున్న గ్రామస్తులు.. కాళేశ్వరం జలాల రాకతో మరో ఏడువేల ఎకరాలను అచ్చుకట్టారు. మొత్తం 10,589ఎకరాలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు