గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 01, 2020 , 16:55:09

అంగ‌న్‌వాడీ కేంద్రాల పెర‌ట్ల‌లో కూర‌గాయ‌ల సాగును చేప‌ట్టాలి : అనితా రాంచంద్ర‌న్‌

అంగ‌న్‌వాడీ కేంద్రాల పెర‌ట్ల‌లో కూర‌గాయ‌ల సాగును చేప‌ట్టాలి : అనితా రాంచంద్ర‌న్‌

హైద‌రాబాద్ : అంగ‌న్‌వాడీ కేంద్రాల పెర‌ట్ల‌లో కూర‌గాయ‌ల సాగును ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్ అనితా రాంచంద్ర‌న్ అన్నారు. మంగ‌ళ‌వారం యాద‌గిరిగుట్ట‌లోని ఓ అంగ‌న్‌వాడీ కేంద్రంలో పోష‌క్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ర్ట ప్ర‌భుత్వం గ‌ర్భిణీల‌కు, పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన పోష‌క ఆహార ప‌దార్థాల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రీ-స్కూల్ విద్యను విస్తరించడంతో పాటు గర్భిణీలు, బాలింత‌లు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు బహుళ సేవా కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. చిన్నారుల‌, గ‌ర్భిణీల బ‌రువు కొలిచేందుకు ప్ర‌తీ కేంద్రంలో తూక‌పు మిష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

పోష‌క మ‌హోత్స‌వ్‌లో విద్యార్థులంద‌రినీ క‌వ‌ర్ చేయాల‌న్న క‌లెక్ట‌ర్ ప్ర‌తీ రోజు ఐదుగురు విద్యార్థుల బ‌రువును రికార్డు చేయాల‌న్నారు. ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో పోష‌కాహార ప్రాముఖ్య‌త గురించి అంగ‌న్‌వాడీ సిబ్బంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యాదాద్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ సుధా మ‌హేంద‌ర్, జిల్లా ఇన్‌చార్జి సంక్షేమ అధికారి జ్యోత్స్నా, జిల్లా పిల్ల‌ల సంర‌క్ష‌ణ అధికారి సైదులు, త‌హ‌సీల్దార్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo