శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:44

మరిన్ని మట్టి గణపతులను కొనుగోలు చేయాలి

మరిన్ని మట్టి గణపతులను కొనుగోలు చేయాలి

  • మంత్రి గంగులను కోరిన కుమ్మరి సంఘం ప్రతినిధులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కుమ్మరి వృత్తిదారులు తయారు చేసిన మట్టి గణపతులను రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, జీహెచ్‌ఎంసీల ద్వారా కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇప్పించాలని కుమ్మరి సంఘం ప్రతినిధులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరారు. కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్‌రావు, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లయ్య, అసోసియేట్‌ అధ్యక్షుడు మల్కాజిగిరి దయానంద్‌ తదితరులు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి గంగులను కలిశారు. హెచ్‌ఎండీఏ ద్వారా 50 వేల మట్టి వినాయక ప్రతిమల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చినందుకు వారు ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 


logo