మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 03:00:51

మలేషియాలో నేదునూర్‌వాసి మృతి

మలేషియాలో నేదునూర్‌వాసి మృతి

తిమ్మాపూర్‌ రూరల్‌: పొట్టకూటి కోసం ఓ వ్యక్తి దేశంకాని దేశం పోయి మరణిం చడంతో.. చివరిచూపు కోసం ఆ కుటుం బం తల్లడిల్లుతున్నది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నేదునూర్‌ గ్రామానికి చెందిన కోరెపు ఎల్లయ్య(48) రెండేం డ్ల కిందట బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి ఓ ప్లాస్టిక్‌ కంపెనీలో కూలీగా చేరాడు. మూడు నెలల క్రితం ఆయనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని తేలింది. దీంతో పనిచేయలేక, చికిత్సకు డబ్బుల్లేక ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచే రూ.లక్షన్నరకు పైగా పంపించారు. వాటితో తోటి కూలీలు మలేషియాలోనే దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించాడు. మృతదేహాన్ని తీసుకురావడానికి రూ.లక్షకు పైగా ఖర్చవుతాయని, కూలి పని చేసుకుని బతికే తమకు అంత డబ్బు వెచ్చిండం సాధ్యం కాదని ఎల్లయ్య భార్య ఆవేదన వ్యక్తం చేసింది. మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నది. ఎల్లయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హామీ ఇచ్చారు.