గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 19:17:20

ఆనంద్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

ఆనంద్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

సంగారెడ్డి : జిల్లాలోని అమీన్‌పూర్ మండలం బీరంగుడలో కారుతో పాటు వరదల్లో కొట్టుకుపోయిన ఆనంద్ అనే వ్య‌క్తి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోట్ల సహాయంతో అన్ని చోట్ల గాలిస్తున్నారు. వరదల్లో ముళ్ళ పొదలు, లేదా మరెక్కడైనా చిక్కుకున్నడా? అనే విష‌యం తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాలను సైతం వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దగ్గరుండి పరిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మూడు రోజులుగా ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


logo