గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 28, 2020 , 10:57:17

లంకలో చిక్కిన వ్యక్తి ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

 లంకలో చిక్కిన వ్యక్తి ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

ఖమ్మం : జిల్లాలోని చింతకాని మండలం చిన్న మండవ గ్రామ సమీపంలోని మునిగేటి ఏటిగడ్డలో చిక్కుకున్న వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం శుక్రవారం ఉదయం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మున్నేరులో గల ఏటిగడ్డకు గడ్డి కోసం చిన్న మండవ గ్రామానికి చెందిన బుల్లి వెంకయ్య అనే వ్యక్తి గురువారం సాయంత్రం వెళ్లి లంకలో చిక్కుకున్నాడు. మున్నేటి వరద ఉధృతి పెరగడంతో.. గ్రామస్తులకు తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా సమాచారామిచ్చాడు.

 విషయం తెలిసిన తహసీల్దార్ ఎస్ఐ, జెట్పీటీసీ తదితరులు ఏటి వద్దకు చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకువచ్చి ఉదయాన్నే చిన్న మండల గ్రామ సమీపం నుంచి లంక ఒడ్డుకు పడవలో వెళ్లి అతని చిన్న మండవ గ్రామానికి తీసుకువచ్చారు.

కాగా, తాము తరచుగా గ్రామ సమీపంలోని లంకకు వెళ్తామని,  అలాగే గురువారం సాయంత్రం వెళ్లడంతో వరద ఉధృతి పెరిగింది. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోయారని బాధితుడు వెంకయ్య తెలిపారు. తనను రక్షించేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.


logo