ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 16:48:55

వ‌ర‌ద‌లో కూలిన ఇల్లు.. అండ‌గా తోటి నాయి బ్ర‌హ్మ‌ణులు

వ‌ర‌ద‌లో కూలిన ఇల్లు.. అండ‌గా తోటి నాయి బ్ర‌హ్మ‌ణులు

న‌ల్ల‌గొండ : నాలుగు చేతులు క‌లిస్తే న‌లుదిక్కుల‌ను జయించ‌వ‌చ్చంటారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా అన్న‌ట్టు న‌ల్ల‌గొండ జిల్లాలోని నిడ‌మ‌నూరు మండ‌ల కేంద్రంలో త‌మ తోటి వ్య‌క్తి బాధ‌ను పంచుకున్నారు నాయి బ్ర‌హ్మ‌ణులు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు, పోటెత్తిన వ‌ర‌ద‌ల‌కు గ్రామంలోని ప‌లు ఇండ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ క్ర‌మంలో నాయి బ్ర‌హ్మ‌ణుడు అయిళ్ల రాములు అనే వ్య‌క్తి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంస‌మైంది. నిరుపేద కుటుంబం కావడంతో నిడమ‌నూరు నాయి బ్రాహ్మణ సొదరులంతా క‌లిసి బాధితుడికి త‌మ చేత‌నైనంత‌లో స‌హాయాన్ని అందించారు. అంతా క‌లిసి రూ. 60 వేల‌ను జ‌మ‌చేసి బాధితుడికి అంద‌జేశారు.  

గ‌డిచిన నాలుగైదు రోజులు తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్ష బీభ‌త్సానికి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంతో పాటు రాష్ర్టంలోని ప‌లు ప్రాంతాలు చిగురుటాకులా వ‌ణికిపోయాయి. పోటెత్తిన వ‌ర‌ద ప్ర‌వాహాల‌తో న‌దులు, కాలువ‌లు, వాగులు, వంక‌లు. నీటి ప్ర‌వాహాలు ఉప్పొంగి ప్ర‌వ‌హించాయి. ఈ ప్ర‌వాహా వేగానికి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, అపార్ట్‌మెంట్ల సెల్లార్ల‌లోకి నీరు చేర‌గా, కాలువ‌ల‌కు స‌మీపంలో ఉన్న ప‌లు ఇళ్లు ప్ర‌వాహా వేగానికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో అనేక మంది నిరాశ్ర‌యుల‌య్యారు. బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగంతో పాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు.logo