గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 14:05:05

ఒంగోలులో కరోనాతో నయా దందా..!

ఒంగోలులో కరోనాతో నయా దందా..!

ఒంగోలు : కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తితో  ప్రజలు బయాందోళ చెందుతున్న క్రమంలో కొందరు కేటు గాళ్లు నయా దందా మొదలు పెట్టారు. వ్యాక్సిన్ వచ్చిందంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఒంగోలు రిమ్స్ దగ్గర కరోనాకు ఇంజక్షన్ ఇస్తామంటూ ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పారు. రూ. 80వేలు ఇస్తే కరోనాకు ఇంజక్షన్ ఇస్తామంటూ కరోనా కేర్‌ ఎదుట ప్రజలను మోసంచేసే ప్రయత్నం చేశారు.

దీంతో అనుమానం వచ్చిన ఓ వ్యక్తి వారితో గొడవకు దిగాడు. స్థానికులు గుమిగూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకులను విచారించి అక్కడి నుంచి పంపివేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo