ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:31

జిల్లాకో నవోదయ విద్యాలయం

జిల్లాకో నవోదయ విద్యాలయం

  • కేంద్రమంత్రికి టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కొత్తగా 21 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌కు లేఖ రాశారు. 12 జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌రూరల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ కొత్తగా స్థాపించాలని కోరారు.  


logo