శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 16:15:28

రాజ్‌భవన్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

రాజ్‌భవన్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

హైదరాబాద్‌ : దేశ ప్రప్రథమ ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంత్రి సందర్భంగా రాజ్‌భవన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం ( ఏక్తా దివస్‌)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజ్‌సభవన్‌ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశంలో సంస్థానాలను విలీనం చేసిన ఘనత వల్లాభాయ్‌ పటేల్‌దేనని ఆమె పేర్కొన్నారు. దేశ ఐక్యతకు పటేల్‌ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.  పటేల్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. యువత ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.