సోమవారం 13 జూలై 2020
Telangana - Jan 31, 2020 , 22:27:35

జాతీయ క్రీడా ప్రణాళిక - 2011ను రాష్ట్ర క్రీడా శాఖలో తక్షణమే అమలు చేయాలి..

జాతీయ క్రీడా ప్రణాళిక - 2011ను రాష్ట్ర క్రీడా శాఖలో తక్షణమే అమలు చేయాలి..

హైదరాబాద్: జాతీయ క్రీడా ప్రణాళిక - 2011ను తెలంగాణ క్రీడా శాఖలో తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనెజింగ్ డైరెక్టర్ ను అదేశించారు. కేంద్ర క్రీడా శాఖ క్రీడా అభివృద్ది ప్రణాళికలో భాగంగా  జారీ చేసిన మార్గదర్శకాలను తెలంగాణ క్రీడా శాఖ అమోదం తెలుపుతూ మెమో నెంబర్ 2578 / Sports / 2018 Date. 03.10.2018 ను విడుదల చేసిందన్నారు. తెలంగాణ క్రీడా అభివృద్ది ప్రణాళికలో భాగంగా మంత్రి శ్రీనినాస్ గౌడ్  క్రీడా సంఘాల పాలన వ్వవహారాల మెరుగుపరిచేందుకు సమీక్ష ను నిర్వహించారు. ఈ సమీక్ష లో మంత్రి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి  కేసీఆర్ గారి అదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న వివిధ క్రీడా సంఘాల, సమాఖ్యల పనీతీరు పై చర్చించారు. జాతీయ క్రీడా ప్రణాళిక - 2011 లో నిర్ణయించిన మార్గదర్శకాల అమలులో భాగంగా క్రీడా సంఘాల, సమాఖ్యల కాల పరిమితి, సభ్యుల వయో పరిమితి తగ్గింపు పై క్రీడా శాఖ ఉన్నతాధికారులకు అదేశాలు జారీచేశారు. 

క్రీడా సంఘాలలో కీలక పదవులైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి , కోశాధికారి లాంటి పదవుల కు ఎంపికయ్యే సభ్యుల వయో పరిమితి 70 సంవత్సరాల లోపు ఉండాలని క్రీడా శాఖ అధికారులకు మంత్రి సూచించారు . క్రీడా సంఘాలలో పరిపాలన వ్యవహరాలు,  మెరుగైన పనీతీరు, జవాబుదారీ తనం, పారదర్శకత ఉండేలా క్రీడా సంఘాలు పనిచేయాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. క్రీడా సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి క్రీడా శాఖ అధికారులకు అదేశాలు జారీ చేశారు.


logo