బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 12:51:40

ఏపీ 203 జీవోపై ఎన్జీటీ స్టే

ఏపీ 203 జీవోపై ఎన్జీటీ స్టే

హైదరాబాద్‌ : సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్‌ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు, కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్‌ సభ్యుడు, హైదరాబాద్‌ ఐఐటీ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించొద్దని ఏపీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. 


logo