టీఎస్ఆర్టీసీకి జాతీయ పురస్కారం

నేడు అందుకోనున్న ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీకి మరో జాతీయ పురస్కారం లభించింది. ఇంధన పొదుపులో రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నది. 4001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల క్యాటగిరీలో ఈ ఘనత సాధించింది. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలానికి కేంద్ర పెట్రోలియం, సహజవనరులశాఖ ఈ అవార్డును ప్రకటించింది. శనివారం ఢిల్లీలో వర్చువల్ పద్ధతిలో జరిగే సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ అవార్డుతోపాటు రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోనున్నారు. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ (కిలోమీటర్ పర్ లీటర్) 5.16 ఉండగా, 2020లో అది 5.28కి పెరిగింది. దీనివల్ల సంస్థకు దాదాపు రూ.19 కోట్ల మేర ఆదా అయ్యింది. మరోవైపు, రాష్ట్రస్థాయి ఇంధనపొదుపులో హయత్‌నగర్-1, ఉప్పల్, దిల్సుఖ్నగర్ డిపోలు ఉత్తమ డిపోలుగా నిలిచాయి.
మంత్రి పువ్వాడ అభినందన
ఆర్టీసీకి జాతీయస్థాయిలో అవార్డు రావడంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, అధికారులు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- వాణీదేవి గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేయాలి
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్